ఉత్తరాంధ్రలో 400 మంది నటీనటులను రిక్రూట్ చేయనున్న రామ్ చరణ్ RC16 టీమ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ RC16 టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్రకు రాబోతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తదుపరి పాన్ ఇండియా చిత్రం- #RC16 కోసం ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అరంగేట్రం చేసిన యువ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు బుచ్చి బాబు సనాతో జతకట్టనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సగర్వంగా సమర్పిస్తున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

కొంతమంది అద్భుతమైన సాంకేతిక నిపుణులు విభిన్నమైన క్రాఫ్ట్‌లను చూసుకునే ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో తమ డైలాగ్‌లను అనర్గళంగా చెప్పగల నటీనటులు అవసరం. అందుకే ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ కోసం ఆర్సీ16 టీమ్ వస్తోంది. ఔత్సాహిక నటీనటులందరినీ ఏదో ఒక సంచలనంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండమని వారు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో 5వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆడిషన్స్ జరుగుతాయి. దాదాపు 400 మంది వివిధ వయసుల నటీనటులు ఈ సినిమా కోసం నటించనున్నారు.

బుచ్చిబాబు యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.

Leave a Comment

Enable Notifications OK No thanks