Beetroot Cutlet recipe in Telugu
బీట్రూట్ కట్లెట్ కోసం కావలసిన పదార్థాలు (Ingredients for Beetroot Cutlet)
బీట్రూట్ తురుము | 2 కప్పులు |
బంగాళ దుంప | 1 (మెత్తగా ఉడికించి ముద్ద చేసుకోవాలి) |
ఉల్లిపాయ ముక్కలు | పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) |
పసుపు | పావు టీ స్పూన్ |
కారం | 1 టీ స్పూన్ |
జీలకర్ర పొడి | పావు టీ స్పూన్ |
గరం మసాలా | అర టీ స్పూన్ |
అల్లం- వెల్లుల్లి పేస్ట్ | 1 టీ స్పూన్ |
ఉప్పు | తగినంత |
బ్రెడ్ పౌడర్ | ఒకటింపావు కప్పులు |
కొత్తిమీర తురుము | 2 టేబుల్ స్పూన్లు |
మొక్కజొన్న పిండి | 2 టేబుల్ స్పూన్లు |
మైదాపిండి | 1 టేబుల్ స్పూన్ |
మిర్యాల పొడి | అర టీ స్పూన్ |
ఉప్పు | కొద్దిగా |
నీళ్లు | పావు కప్పు |
నూనె | డీప్ ఫ్రైకి సరిపడా |

బీట్రూట్ కట్లెట్ తయారీ విధానము (Beetroot cutlet recipe in Telugu)
- ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ తురుము, బంగాళ దుంప గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం- వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పావు కప్పు బ్రెడ్ పౌడర్, కొత్తిమీర తురుము వేసుకుని ముద్దలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న బౌల్ తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, మైదాపిండి, మిర్యాల పొడి, ఉప్పు, నీళ్లు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి.
- మరో బౌల్ లో మిగిలిన బ్రెడ్ పౌడర్ వేసుకుని ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్లో నూనె వేసుకుని వేడి కాగానే బీట్రూట్ మిశ్రమాన్ని కోడి గుడ్డంత ముద్ద తీసుకుని చేత్తో కట్లెట్లా నొక్కి మొక్కజొన్న- మైదా మిశ్రమంలో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించాలి.
1 thought on “Beetroot Cutlet recipe in Telugu || బీట్రూట్ కట్లెట్ తయారీ విధానము”