అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తు || Praja Palana Form details in Telugu

అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తు (Abhaya Hastam Praja Palana Form details in Telugu)

Praja Palana Form details: రేపటి నుంచి మొదలుకాబోయే ప్రజాపాలన కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తు పేరుతో ఒక ఫాం ని రెడీ చేసింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ఫాం ని అఫీషియల్ గా విడుదల చేసారు.

ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేకుండ, అన్ని పథకాలకు ఒకే ఫాం లొ వివరాలను పొందు పరచేలా ఈ అప్లికేషన్ ఫాం ని సిద్ధం చేసారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సంధర్భంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం పది రోజులు ప్రతి గ్రామం ప్రతి నియొజకవర్గం నుంచి దరఖాస్తులు తీసుకోనున్నారు.

Congress 6 Guarantee Card Registration in Telangana

కాంగ్రెస్ పథకాలు: “ప్రజాపాలన” దరఖాస్తు విధానం (Praja Palana Form details)

ఈ అభయ హస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫాం లో యువ వికాసం తప్పితే మిగతా ఐదు గ్యారెంటీలకు దరఖాస్తు చేసే అవకాశం ఇవ్వడం జరిగింది.

ఇందులో కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది:

  • దరఖాస్తుని పేరు
  • పుట్టిన తేది
  • వ్రుత్తి
  • కులం
  • ఆధార్ నంబరు
  • ఫోన్ నంబరు మరియు
  • ఫామిలీ మెంబెర్స్ డెటైల్స్ నింపాల్సి ఉంటుంది.

తరువాత వరుసగా మహాలక్ష్మి పథకం, ఇంద్రమ్మ ఇల్లు, రైతు భరోసా, గ్రుహ జ్యొతి, చేయుత పథకాల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకానికి అడిగిన వివరాలతో నింపాలి.

Praja Palana Form details
Praja Palana Form details

‌ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫామ్ (Congress 6 Guarantees Application Form)

Praja Palana Form details (“ప్రజాపాలన” దరఖాస్తు విధానం)

మహాలక్ష్మి పథకం

ఫస్టు మహాలక్ష్మి పథకం కింద ఆర్ధిక సహాయం పొందేందుకు అందుకు సంభందించిన గడిలో టిక్ పెట్టలి. తరువాత 500 రూపాయలకు సబ్సిడి గ్యాస్ సిలిండర్ పొందేందుకు, గ్యాస్ కనెక్షన్ నంబర్, ఏజెన్సి పేరు, సంవత్సరానికి ఎన్ని సిలండర్ వినియొగిస్తున్నరు అనె సంఖ్యను కూడా రాయల్సి ఉంటుంది.

Praja palana form details 1
Praja palana form details 1

రైతు భరోసా

రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి, వ్యవసాయం కలిగిన వ్యక్తా లేక కౌలు రైతా అనే బాక్స్ పై టిక్ పెట్టాల్సి ఉంటుంది. అందులో పట్టాదారుని పాసు పుస్తకం నంబరు, సాగు చేస్తున్న భూమి వివరాలు ఇవ్వాలి. ఒక వేల వ్యవసాయ కూలి ఐతే ఉపాది హామి కార్డ్ నంబరు రాయాలి.

ఇందిరమ్మ ఇల్లు

ఇక ఇందిరమ్మ ఇల్లు పొందాలనుకునే వారు ఇంటి నిర్మానికి ఆర్ధిక సహాయం కావలా వద్ద అనే బాక్స్ పై టిక్ పెట్టాలి. అమరవీరులకు చెందిన వ్యక్తులైతే పేరు, అమరులైన సంవత్సరం, FIR నంబరు, డెత్ సర్టిఫికేత్ట్ నంబరు రాయల్సి ఉంటుంది. ఒక వేల ఉద్యమకారుల వారు ఐతె FIR నంబరు, జైలు కెళ్ళిన వివరాలు ఇవ్వల్సి ఉంటుంది.

Congress 6 guarantee form
Congress 6 guarantee form

గ్రుహ జ్యోతి పథకం

ఇక గ్రుహ జ్యోతి పథకం కోసం ఒక నెలలో ఎంత విద్యుత్ ఉపయొగిస్తున్నారు అనేది యునిట్ లలో ఇవాల్సి ఉంటుంది. దాంతో పాటు మీ గ్రుహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది.

Congress 6 guarantee form final
Congress 6 guarantee form final

చేయూత పథకం

చేయూత పథకం పొందాలనుకునేవారు దివ్యాంగులైతే అందుకు సంభందించిన బాక్స్ పై టిక్ పెట్టలి. మిగితా వారు వ్రుద్ధులు, వితంతువు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు ఏది ఐతె ఆ బక్స్ పై టిక్ చెయ్యాల్సి ఉంటుంది. ఐతె ఇందులో దివ్యాంగులకి 6000 రూపాయలు మిగితా వారికి 4000 వేల రూపాయలు ఇవ్వబడతాయి.

అన్ని ఫిల్ చేసిన తరువాత దరఖాస్తుని పేరు, సంతకం, మరియు తేది వెయ్యాల్సి ఉంటుంది. ఆధార్ కార్ద్ జిరక్స్ తో పాటు తెల్ల రేషన్ కార్ద్ జిరాక్స్ జత చెయ్యల్సి ఉంటుంది.

ఇలా నింపిన దరఖాస్తుని గ్రామ సభలలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెబితే వాళ్లు అన్ని చెక్ చేసుకొని మీరు ఏ ఏ పథకానికి అర్హులో నిర్నయిస్తారు. అలా దరఖాస్తు చివరిలో ఉన్న రశీదుని వాళ్ళే ఫిల్ చేసి, సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

For health related content. click here.

Leave a Comment

Enable Notifications OK No thanks