Weight loss tips in Telugu (బరువు తగ్గడానికి చిట్కాలు)
క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, దోసకాయ, బ్రొకోలి, అవకాడో, ఆలివ్ఆయిల్, గ్రీన్ యోగర్ట్, మొలకలు, ఓట్స్, దంపుడు బియ్యం, తృణ ధాన్యాలు, యాపిల్స్, అరటిపళ్లు, బ్లూబెర్రీలు వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్, కిడ్నీ బీన్స్, ఫ్యాటీ ఫిష్, వంటివి బాగా తినాలి.
సమతులాహారం తీసుకోవాలి. పీచుపదార్ధాలు బాగా ఉండేలా చూసుకోవాలి. వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. షుగర్ డ్రింక్స్ తీసుకోవద్దు.
బరువు తగ్గాలంటే ప్రొటీన్లు బాగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అంటే తాజాగా ఉడకబెట్టిన గుడ్డు, స్మోకీ సాల్మన్ వంటివి తినాలి. ఉదాహరణకు రెండు ఉడకబెట్టిన గుడ్లు, సలాడ్, బ్లాక్ కాఫీ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మంచిది.
కాఫీ లేదా గ్రీన్ టీ తాగితే మంచిది. ఈ రెండింటిలో ఉండే కెఫైన్ వల్ల బరువు తగ్గుతారు. మిలటరీ డైట్ చేస్తే కూడా మంచిది. ఫాస్టింగ్, ఈటింగ్ రెండూ ఈ విధానంలో అనుసరిస్తారు. ఇలా చేయడం వల్ల తక్కువ క్యాలరీలే శరీరానికి అందుతాయి బరువు తగ్గించే హార్మోన్లు క్రమబద్ధీకరణ చెందుతాయి.

Exercise weight loss tips in Telugu (బరువు తగ్గడానికి వ్యాయామ చిట్కాలు)
ఉదయంపూట వర్కవుట్లు చేయాలి. ఇతర వేళల్లో వ్యాయామాలు చేయడం కన్నా ఉదయం పూట వ్యాయామాలు చేస్తే 20 శాతం ఎక్కువగా క్యాలరీలు కరుగుతాయి.
కార్డియో వ్యాయామాలు చేస్తే ఎంతో మంచిది. అంటే రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, జుంబా, బ్రిస్వక్, మెట్లు ఎక్కడం వంటివి. ఇంట్లో ట్రెడ్మిల్, స్టేషనరీ బైక్ మీద సైక్లింగ్ చేస్తే కూడా మంచిది. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
రెసిస్టెన్స్ వ్యాయామాలు చేస్తే కూడా శరీరానికి ఎంతో బలం వస్తుంది. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. ఇందుకు వెయిట్ లిఫ్టింగ్ మంచిది. డంబల్స్తో కూడా ఈ వ్యాయామం చేయొచ్చు.
Diet Weight loss tips in Telugu
బరువు తగ్గొచ్చిలా…
నేషనల్ ఒబెసిటీ ఫౌండేషన్ ప్రకారం మహిళల్లో, చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఏటికేడాది పెరుగుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు డాక్టర్లని ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే ఇతరత్రా పద్ధతుల కన్నా, చక్కటి ఆహార నియమాలను పాటించడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు.
అందుకు ఉపయోగపడే పదార్థాలే ఇవి: Weight loss foods in Telugu
అవిసె గింజలు:
రోజూ చెంచా అవిసె గింజల్ని పచ్చక్లూ, టిఫిన్లూ, పండ్ల రసాలూ, ఓట్స్, మజ్జిగ, దేనిలో నైనా సరే కలుపుకొని తాగితే మంచిది. సలాడ్లపైనా అరచెంచా అవిసె గింజల నూనె చల్లుకుంటే మంచిది. అవిసె గింజల్లో అధికంగా ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గర్భిణులు మాత్రం వీటికి దూరంగా ఉండటం తప్పనిసరి.
గ్రీన్ టీ:
శరీరానికి ఎంతో మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు వీటిల్లో అధికం. అంతేకాకుండా, శరీర మెటబాలిజాన్ని ఉత్తేజం చేస్తూ, కెలొరీలను కరిగించే పోషకాలను గ్రీన్ టీ కలిగి ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దాల్చినచెక్క రక్తంలోని చక్కెర నిల్వల్ని సమన్వయం చేయడంలో దాల్చిన చెక్క పాత్ర కీలకం.
శరీరంలో పేరుకొన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని పొడిగా చేసుకొని వేడి అన్నంలో కాస్త వేసుకొని తింటే సరి. ఇది జీర్ణవ్య వస్థనూ మెరుగు పరుస్తుంది.
మిరియాలు:
జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడే పదార్థాల్లో మిరియాలు ఒకటి. ఇది శరీరంలో అనవసరంగా కొవ్వు చేరకుండా సాయపడుతుంది. సలాడ్లూ, కూరల్లో చిటికెడు చల్లుకొని తింటే రుచిగా ఉంటుంది.
పసుపు:
యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా దీనికి శరీర మెటబాలిజమ్ రేటుని మెరుగుపరిచే శక్తి కూడా కలిగి మెటబాలిజమ్ రేటునీ మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను నిరోధిస్తుంది. ఫలితంగా అధికబరువు అదుపులో ఉంటుంది.
These are some of the weight loss tips in Telugu.
NOTE: Individuals with specific health concerns or dietary restrictions should consult with a healthcare professional for personalized advice.
1 thought on “Weight loss tips in Telugu || బరువు తగ్గడానికి చిట్కాలు”